హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/27 ఆగష్టు: ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఆమెకు సుప్రీం కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా గంటన్నరట పాటు వాదానలు జరిగాయి. దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వీ రాజు, కవిత తరఫున ముకుల్ రోహత్గీ తమ వాదనలు వినిపించారు. ఫైనల్ గా కవిత బెయిల్ కు అర్హురాలన్న రోహత్గీ వాదనలు వాదనలతో ఏకీభవించిన అత్యున్నత ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. మార్చి 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ సారి కవిత తరుపు లాయర్ రోహత్గీ బలంగా తన వాదానలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో రూ.100 కోట్లు చేతులు మారాయన్నది ఆరోపణ మాత్రమే. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. కవిత ఎవరినీ బెదిరించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది అంటూ తన వాదానలను బలంగా వినిపించారాయన.
ఈ క్రమంలో కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్గీ గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముకుల్ రోహత్గీ 1955 ఆగస్టు 17న ముంబైలో జన్మించాడు. గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయ మూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈయన తండ్రి పేరు జస్టిస్ అవధ్ బిహారీ రోహత్గీ. ఆయన కూడ లాయరే. ప్రస్తుతం ఇండియాలో అగ్రశ్రేణి న్యాయ వాదులలో ఒకరైన రోహత్గీ ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబర్వాల్ వద్ద ప్రాక్టిస్ స్టార్ట్ చేశాడు. అలా అంచలాంచలుగా ఎదిగారు. ముకుల్ వసుధ రోహత్గీని వివాహం చేసుకున్నారు. ఈమె కూడా లాయరే. వీరికి నిఖిల్ రోహత్గి, సమీర్ రోహత్గీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భారత ప్రభుత్వం ముకుల్ రోహత్గీ 1999 నవంబర్ లో ఐదేళ్లపాటు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. తరువాత 19 జూన్ 2014 నుండి 18 జూన్ 2017 వరకు NDA ప్రభుత్వంలో భారతదేశ అటార్నీ జనరల్‌గా నియమించబడ్డారు. ముకుల్ తన పదవీకాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్ కేసు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఆధార్ కేసు వంటి విజయవంతమైన కేసులను వాదించారు. అటల్ బిహారీ బాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో లా ఆఫీసర్‌గా కూడా పనిచేసిన రోహత్గీ 2002 అల్లర్లు, బూటకపు ఎన్కౌంటర్ కేసులలో గుజరాత్ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించారు. ముకుల్ హై ప్రోఫైల్ కేసులే ఎక్కువగా వాదిస్తారన్న పేరుంది. ఈయన గంటకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఫీజు ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది.