విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంకీపాక్స్‌కు ప్రత్యేక వార్డు ఏర్పాటు..
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతీ/26 ఆగష్టు: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మంకీ పాక్స్‌కు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారని వైద్యులు వెల్లడి. దేశంలో ఇటీవల మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వేళ ఏపీలో కేసులు వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు పడకలు, అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో వార్డును ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేష్ వెల్లడించారు.