దొంగ లు,దొంగ లు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉంది ఈ హైదరాబాద్ చెరువుల కబ్జా..
“అక్కినేని నాగార్జున హీరో కాదు- విలన్ “
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/25 ఆగష్టు: హైదరాబాద్ మహా నగరంలో 50% భూమి ఆక్రమణకు గురి ఐయ్యింది అన్నది పచ్చి నిజం. ఈ వేల ఎకరాల భూమిని 5% లేని “రెడ్డి, వెలమ, కమ్మ”దొరలే ఆక్రమించారు. ఇది దాదాపు 50 ఏళ్ల పై నుండి సాగుతూనే ఉంది. బంగారంతో సమాన ధర పలికేంత ఈ భూమి మొత్తాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని “ధర్మ సమాజ్ పార్టీ” డిమాండ్ చేస్తుంది.
ఈ మహా నగరంలో దాదాపు 2000 చెరువులు FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్ – పూర్తి చెర్వు నిండే ప్రాంతం) & బఫర్ జోన్ (చెరువు వరద ప్రభావిత ప్రాంతం) ల లోపటికి ఈ రెడ్డి, వెలమ, కమ్మ దొరలు జొరబడి ఆక్రమించి కట్టడాలు కట్టి పారేశారు. ఈ భూమి విలువ ఎంతో తెలుసా మిత్రులారా…! 25 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు సరిపోయే అంత…!
ఈ ధనంతో తెలంగాణ లోని 3 కోట్ల మంది BC,SC,ST ల పేదరికాన్ని తరిమి, తరిమి కొట్టొచ్చు. షిరిడి సాయి బాబా, అన్నమయ్య వేషాలు వేసిన అక్కినేని నాగార్జున N కన్వెన్షన్ ని ఎట్లా కూలగొట్టారో అదే విధంగా అన్ని పార్టీల లోని వెలమ, రెడ్డి, కమ్మ దొరలు ఆక్రమించిన భూమిలని, భూమిలోని కట్టడాలను కూల్చి, స్వాధీనం చేసుకోవాలి. “ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అగ్ని పరీక్ష” ఈ యజ్ఞం పూర్తీ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక వాది అని నిరూపించు కోవాలని కోరుకుంటున్నా.
పేదలు,మధ్య తరగతి వారి ఇంటి కట్టడాలను ముట్టుకోవద్దని ఈ హైడ్రా వారికి ప్రభుత్వాన్నికి X వేదికగా విశారదన్ మహారాజ్ విజ్ఞప్తి చేశారు.