మరిన్ని నగరాలకు హైడ్రా?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/25 ఆగష్టు: హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిర్మల్, నల్లగొండ, గద్వాల, కామారెడ్డి సహా పలు నగరాలు, పట్టణాల్లో చెరువులు, శిఖం భూములు, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో చెరువులు, కుంటల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైడ్రా వంటి వ్యవస్థతో వాటిని సంరక్షించాలని భావిస్తోంది.