హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం..
పీఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /25 ఆగష్టు:
హైడ్రాను బలోపేతం చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ముందడుగు చర్యలు చేపట్టనుంది. పీఎస్ స్టేటస్ తో హైడ్రానే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వెసులుబాటు కల్పించనుంది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు విలువలను ఉన్నాయని తెలుస్తుంది. హైడ్రా కూల్చేసిన భవనాల అనుమతులపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులతో చర్చించి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.