11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు కేబినెట్‌ ఆమోదం

Get real time updates directly on you device, subscribe now.

పెన్షన్స్ స్కీమ్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ఆమోదం..

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/24 ఆగష్టు: పెన్షన్స్ స్కీమ్ విషయంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ఆమోదం తెలిపింది.

25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం తెలిపింది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.

కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ పదేళ్లు సర్వీసు చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్‌ ఇస్తారని తెలిపారు. సర్వీసులో 25 ఏళ్లు పూర్తయిన వారికి ఈ పూర్తి పెన్షన్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది కేంద్రం. బయో ఈ-3 విధానానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment