హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఆగష్టు 18: వినియోగదారులకు గుడ్ న్యూస్ కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక నుంచి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించాయి. ఈ రెండు భారత్ బిల్ పేలో చేరక పోవడంతో ఆర్బీఐ ఆదేశాల మేరకు గతంలో రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థలు ఈ మేరకు నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇవి భారత్ బిల్‌పే లిమిటెడ్‌లో చేరడంతో ఈ వెసులుబాటు కలిగింది.