తెలంగాణలో 18 ఏళ్లు నిండిన వారికి బిగ్ అలర్ట్!!! అక్టోబర్ 29 నుంచి…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/10 ఆగష్ట్: దేశ అభివృద్ధిలో యువతది కీలక పాత్ర. అందుకే వారికి నిర్ధిష్ట వయస్సును బట్టి ఎన్నికలల్లో పాల్గొన్నేందుకు, ఓటేసే అవకాశాన్ని మన రాజ్యాగం కల్పించింది.
ఈ క్రమంలోనే 18 ఏళ్ల వయస్సు నిండిన వారికి ఓటుకు అప్లయ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం విని. B BBఅవకాశం కల్పిస్తుంది. అంతేకాక కొన్ని సందర్భాల్లో ప్రజలకు కీలక అలెర్ట్ సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ జారీ చేస్తుంది. అలానే తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని 18 ఏళ్లు నిండిన వారికి బిగ్ అలెర్ట్ వచ్చింది. మరి ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు ఎన్నికల కమీషన్ శ్రీకారం చుట్టింది. ఆగష్టు 20వ తేదీ నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభమై జనవరి 6వ తేదీతో తుది జాబితా ప్రకటనతో ముగియనుంది. ఆగస్టు 20 నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో)లు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల లిస్టు ను పరిశీలిస్తారు. ఇదే సమయంలో అవసరమైతే పోలింగ్ కేంద్రాల్లో మార్పులు కూడా చేస్తారు. అధికారుల పరంగా చేయాల్సిన బాధ్యతలన్నింటినీ అక్టోబరు 28 కల్లా పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలోనే ముసాయిదా ఓటరు జాబితాను అక్టోబర్ 29న ప్రచురిస్తారు.
ఇదే సమయంలో కొత్త వారికి ఓటు హక్కును పొందే అవకాశం కల్పించింది. 18 ఏళ్లు నిండిన వారు ఓటు కోసం అప్లయ్ చేసుకోవచ్చు. అయితే 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు మాత్రమే ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓటు హక్కు కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటుతో పాటు అడ్రెస్ మార్చుకోవడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, ఓటరు వివరాలు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇక అక్టోబరు 29 నుంచి ప్రారంభమయ్యే దరఖాస్తులు నవంబర్ 28 వరకు స్వీకరిస్తారు. అదేవిధంగా డిసెంబర్ 24లోపు అప్లికేషన్లను పరిశీలిస్తారు. ఇలా ఓట్లకు సంబంధించిన పూర్తి ప్రక్రియ పూరైన తరువాత తుది ఓటరు లిస్ట్ ను 2025 జనవరి 6న ప్రచురిస్తారు.
గతంలోనూ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఓటర్ జాబితా విషయంలో కీలక ప్రకటన చేసింది. ఆ సమయంలో కూడా కొత్త వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించి. బూత్ లెవల్ ఆఫీసర్లు .. ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేశారు. అలా పార్లమెంట్ ఎన్నికలకు ముందు..చాలా మంది కొత్త వారు ..ఓటు హక్కును పొందారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.