హ్యూమన్ రైట్స్ టుడే/ఒలింపిక్/09 ఆగష్టు: పారిస్ ఒలింపిక్స్ 2024లో రజత పతకాన్ని సాధించిన భారత ఏస్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.
ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగం ఫైనల్స్ లో 89.45 మీటర్ల త్రోతో రెండో స్థానాన్ని కైవసం చేసుకొని సిల్వర్ మెడల్ అందుకున్న నీరజ్ చోప్రా దేశానికి గర్వకారణమని, ఈ విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.