ఫోన్ పే, గూగుల్ పే వాడే వారికి భారీ గుడ్ న్యూస్..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/08 ఆగష్టు: పరపతి విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్న ట్యాక్స్ పేయర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే, ఆదాయ, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఇక మీదట ఒకే లావాదేవీలో రూ.5 లక్షల మేర చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంపీసీ తెలిపింది. అంతకు ముందు ఆ పరిమితి కేవలం రూ.లక్ష వరకు మాత్రమే ఉండేది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాల వెల్లడి సందర్భంగా ఆర్‌బీఐ ఈ కీలక ప్రకటన చేసింది.