హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/07 ఆగష్టు: ఆగస్టు 1న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మాదిగ అమరవీరులకు అంకితం చేస్తూ మంగళవారము ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నాచౌక్ లో విజయోత్సవ ర్యాలీ TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సహకరించిన న్యాయవాదులకు, పోలీస్ అధికారులకు, మీడియా మిత్రులకు, మాదిగ మాదిగ ఉప కులాలతో పాటు బీసీ మైనార్టీటి, వికలాంగులు రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విజయోత్సర్యాలీ నిర్వహించడం జరిగింది.
మూడు దశాబ్దాల సామాజిక న్యాయ ఉద్యమ పోరాటానికి దేశ ఉన్నత న్యాయస్థానం న్యాయం చేసింది. సదాలక్ష్మి అమ్మ ఆశయం నెరవేరింది. మాదిగ మాదిగ ఉప కులాల చిరకాల ఆకాంక్ష పలించింది. అమరుల త్యాగఫలం వృధా కాలేదు. ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ కూడా తగ్గకుండా న్యాయ బద్ధమైన న్యాయ కోసం నిరంతరము ఉద్యమించిన ఈ దేశంలో 40 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమం కొనసాగిన కుల ప్రస్థాన ఉద్యమం మాదిగ దండోరా ఉద్యమం. అన్ని రాజకీయ పార్టీలు సహకరించి ఈ సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేసినారు.
ఈ విజయోత్సరాలికి ముఖ్య అతిథులుగా TMRPS వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ, TMRPS రాష్ట్ర అధ్యక్షులు సిరసనోల్ల బాలరాజు మాదిగ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బోయపల్లి నర్సింహులు, మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లు భాష పొంగు సత్యం మాదిగ, సింగ పాగా జంగయ్య మాదిగ, రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి బాలరాజు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి జోగు రామ స్వామి మాదిగ, TMRPS నాయకులు జాంగారరవి కత్తి ఉపేందర్, దుర్గయ్య, కనకం రవి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.