కేరళలో వయనాడ్ బాధితుల కోసం ప్రభాస్ రూ.2 కోట్లు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/07 ఆగష్టు: కేరళలోని వయనాడ్ విపత్తు బాధితుల పట్ల రెబల్ స్టార్
ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. వారికి అండగా నిలిచేందుకు ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు విరాళమిచ్చినట్లు ఆయన టీమ్ ప్రకటించింది. ఇప్పటికే అల్లు అర్జున్ రూ.25 లక్షలు, చిరంజీవి, రామ్‌చరణ్ కలిపి రూ. కోటి ఇచ్చారు. అటు సూర్య, విక్రమ్, మమ్ముట్టి, మోహన్‌లాల్, నయనతార వంటి స్టార్స్ కూడా కేరళకు అండగా నిలిచారు.