సుప్రింకోర్టు తీర్పుపై ”మరింత” విశ్లేషణ -3:
=======================
సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం, సమానత్వం, సమానప్రాతినిధ్యం, తదితర పేర్లతో తీర్పులుఇచ్చే నైతిక అర్హత భారత న్యాయవ్యవస్థలో భాగమైన గౌరవ “ఉన్నత, అత్యున్నత” న్యాయస్థానాలకు వుందా? ఎదుటివారి గురించి వ్యాఖ్యానించే, మాట్లాడేముందు.. మనవీపుమనం చూసుకొని, మనవైపునుంచి సమాజానికి, దేశానికి ఎంతమేరకు న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది అన్నది కూడా.. బేరీజువేసుకోవాలి, లెక్కలోకితీసుకోవాలి, పరిగణలోకితీసుకోవాలి గదా!
ఈ 75 సంవత్సరాలకాలంగా న్యాయవ్యవస్థలో అన్నిస్తాయిల, విభాగాలలో ముఖ్యంగా హైకోర్టు, సుప్రింకోర్టుల పరిధిలో కేవలం రెండంటే 2 శాతం మాత్రమే వుంటున్న విదేశీ ఆర్యబ్రాహ్మణ మనువాద సంతతి మూలాలున్న ఇక్కడి బ్రాహ్మణ వర్ణమే.. అత్యధిక శాతం ధగ్గరదగ్గర, ఇంచుమించు, దాదాపు 80 నుంచి 90 శాతం అవకాశాలను అడ్డదిడ్డంగా, అడ్డగోలుగా కొల్లగొట్టినట్లు, దొబ్బితుంటున్నట్లు స్పష్టమైన ఆధారాలు, లెక్కలు ఉన్నట్లు తెలుస్తోంది.
అందరికీ సమాన అవకాశాలను కల్పించాల్సిన ప్రధాన రాజ్యాంగ వ్యవస్థ పరిధిలోనే.. ఇలాంటి అశాస్త్రీయ, అహేతుక, అసంబద్ధ.. అనైతిక, అప్రజాస్వామిక పద్ధతులలో, విధానాలలో నియామకాలు.. రాజ్యాంగం అమలులోకి వచ్చిననాటినుంచి, నేటివరకు.. యధేచ్చగా, నిరాటంకంగా, నిర్దయగా, నిర్భయంగా ..ఎటువంటి అదురుబేదురు, జంకుబొంకులేకుండా.. అందరి అవకాశాలను ముఖ్యంగా.. నూటికి 98 శాతంగా వుంటున్న ఈ దేశ మూలనివాసులైన, భూమిపుత్రులైన, మట్టిబిడ్డలైన.. “”మహాజనసమూహం, నిమ్నసమాజం, శూద్రవర్ణం సహా అన్ని కులాల, మతాల, ప్రాంతాల, వర్ణాల, వర్గాల అభ్యుదయ, ప్రగతిశీల, ప్రజాస్వామికవాద భావజాల జాతి ముద్దుబిడ్డల””..నాటి శ్రమన సంస్కృతి/ప్రజాస్వామ్య సంస్కృతి.. హరప్పా, మెహంజోదర, సింధూనాగరికత.. నాగజాతివంశీయులు.. అఖండ జంబుద్వీపవాసులు.. నేడు వారే అత్యధిక శాతంగా వుంటున్న SC, ST, BC/OBC, Minority లు సహా మహిళలతో పాటు వెలమ, కమ్మ, రెడ్డి, కాపు, బలిజ, ఒంటరితెలగ, తదితర అణగారిన కులాల, తరగతుల, వర్గాలకు చెందినవారి అవకాశాలను.. ఒకే కులం, వర్ణం, వర్గం.. ఎలా తింటుంది, పొందుతుంది?. ఇలాంటి పరిస్థితి న్యాయ వ్యవస్థలోని సుప్రీంకోర్టులో గత 7 దశాబ్దాలుగా కొనసాగుతోంది.
ఇది అన్యాయం, అక్రమం.. దారుణం, దుర్మార్గం.. అనైతికం, అప్రజాస్వామికం అనిపించలేదా? న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇచ్చేచోటే.. ఈలాంటి పరిస్థితివుంటే.. మిగితావాళ్లకు జరిగిన “అన్యాయం” గురించి నైతికంగా ఏరకంగా తీర్పులు ఇస్తారు?. మీ వద్దే సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం ఆన్న మాటకు అర్థం, విలువ, గౌరవం.. ప్రాధాన్యత, ప్రాముఖ్యతేలేనప్పుడు.. మిగితావాళ్ళకు ఏ ప్రాతిపదికన ఆదర్శవంతమైన తీర్పులు చెపుతారు?.
పదుల, వందల, వేలసంవత్సరాల నుంచి ఆకలి, అవమానాలు, అస్పృశ్యత, అంటరానితనం, అవిధ్య, అజ్ఞానం, పేదరికం, అంధకారం, అణిచివేత, దోపిడి, వివక్ష, పీడన, దండన, వంచన తదితర సాంఘిక దురాచారాలకు గురై .. ఎటువంటి అవకాశాలకు, హక్కులకు, మానవహక్కులకు, పౌరహక్కులకు, రాజ్యాంగ హక్కులకు నోచుకోక.. విపరీతమైన, విశృంఖల అన్యాయాలకు గురై.. ఇప్పుడిప్పుడే కొద్దిపాటి స్పృహ, అవగాహన, చైతన్యం, మనోవికాసంతో.. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, భారతజాతి ముద్దుబిడ్డ, బాబాసాహెబ్ Dr.B.R. AMBEDKAR గారు సహా మరికొంతమంది రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులచే.. భారత రాజ్యాంగంలో కల్పించబడిన, ప్రసాధించబడిన హక్కులు, అవకాశాలు, అధికారాలు ఉపయోగించుకొని.. సమాజంలోని.. ఇతర ఉన్నత కులాల, వర్ణాల, వర్గాలతో సమానంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న మహత్తరమైన, మహోన్నతమైన చారిత్రక సందర్భంలో.. న్యాయం, సామాజిక న్యాయం, సమానత్వం, సమాన ప్రాతినిధ్యం.. అంతరాలు, అసమానతల పేరుతో.. మాలోమాకు పడకుండా, కాకుండా,గిట్టకుండా.. సజాతి/స్వజాతి కులాలంగా, తరగతులంగా, సమూహాలంగా, సమాజాలంగా కలిసిఉండే ప్రయత్నం నిరంతరాయంగా, అప్రతిహాతంగా జరగకుండా, కొనసాగకుండా.. మహనీయులు కలలుగన్న “ఐక్యత, ఆత్మగౌరవం, సమానత్వం, సమాన ప్రాతినిధ్యం, స్వయం పాలన, రాజ్యాధికారం సాధించకుండా.. అడుగడుగునా భంగం కలిగిస్తూ.. మాలోమాకు గొడవులు, విభేదాలు, విద్వేషాలు, రాగద్వేషాలు నింపుతూ.. బేధాభిప్రాయాలు సృష్టిస్తూ.. మిగితా కులాలలో, వర్ణాలలో అన్యాయ జరగనట్టు.. మాలో మాత్రమే తీరని అన్యాయం జరిగినట్లు “గోబెల్” ప్రచారం చేస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం.. కుట్రపూరితంగా, మోసపూరితంగా ప్రణాళికాబద్ధంగా జరుగుతావుంటే.. దానికి న్యాయ వ్యవస్థలోని ఉన్నత, అత్యున్నత స్థాయి గౌరవ “హైకోర్టులు, సుప్రీంకోర్టు” సైతం అవకాశవాద రాజకీయాలకు వంతపాడడం, దన్నుగా నిలవడం అత్యంత ఆందోళనకర తీవ్రమైన అంశం.
ఏ సమూహాలలో, సమాజాలలో తరతరాలుగా అన్యాయం జరగలేదు. మొదట గౌరవ “సుప్రింకోర్టు” నుంచే న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం జరిగే చారిత్రక నిర్ణయాలకు, చర్యలకు నడుంబిగించాలి, నాందిపలకాలి, శ్రీకారంచుట్టాలి.
అప్పుడు మాత్రమే మీరు ఆదర్శంగా నిలబడి.. మిగితా సంస్థలు, వ్యవస్థలు సహా సమాజం, దేశంలోని ఇతర కులాలు, తరగతులు, వర్ణాలు, వర్గాలకు మార్గదర్శకులుగా నిలబడినట్లు.
అప్పుడు మాత్రమే తీర్పులు ఇచ్చేస్థానంలో ఉండే మీకు నైతిక అర్హత వుంటుందని.. విలువ, గౌరవం కూడా వుంటుందని.. ఎదుటివారి తప్పులు ఎత్తిచూపే ముందు.. మనవైపుతప్పులు లేకుండా చూసుకుంటేనే.. ఏ తీర్పులకైన, ఎటువంటి నిర్ణయాలకైన, చర్యలకైన నైతిక మద్దతు లభించినట్లని.. ముందు వాటిని గుర్తించాలి, గ్రహించాలి, గౌరవించాలి, తదనుగుణంగా నడుచుకోవాలి, వ్యవహరించాలి, ఆచరించాలి.
అలా విస్మరించిన పక్షంలో.. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న ఈ ప్రజాస్వామ్యం కుప్పకూలడం ఖాయం. అప్పుడు, అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా గౌరవ న్యాయవ్యవస్థకు నిర్మాణాత్మకమైన సూచనచేస్తున్నా వినయంగా, వినమ్రంగా.. హుందాగా, గౌరవంగా:
రండి.. ముందు న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం సహా సమానప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించమని పెద్దఎత్తున, భారీఎత్తున డిమాండ్ చేద్దాం.. ఎదుటివాల్లకు నీతులు, బుద్ధిమాటలు చెప్పడమేకాకుండా.. మనం ఎంతమేరకు అధర్శంగా వున్నామోకూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని తీర్పులు ఇచ్చేలా.. సమాజాంలో మార్పు, పెనుమార్పు, విప్లవాత్మకమైన మార్పుకు విశేషంగా ప్రయత్నిద్దాం, కృషిచెద్దాం….
నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములతో….
సంగటి మనోహర్ మహాజన్,
వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త,
రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి/Constitutional Rights Protection Committee (CRPC);
(రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం):
వ్యవస్థాపక జాతీయ ఉద్యమ నిర్మాత,
ఈవీయం వ్యతిరేక జాతీయ ఉద్యమం/National Movement of Anti EVMs (NMAE);
(ఈవీయం వద్దు, బ్యాలెట్ పేపరే ముద్దు):
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,
మహాజన రాజ్యం పార్టీ/
Mahajana Rajyam Party (MRP);
(మన ఓటు, మన రాజ్యం):
Founder Chairman and Managing Director, సౌత్ ఇండియా మీడియా/SOUTH INDIA MEDIA,
(మన మీడియా, మన ప్రాంతం):
కడప, అంధ్రప్రదేశ్, ఇండియా – 9849509416: