హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 ఆగష్టు: రంగారెడ్డి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జిల్లా ఛాంపియన్షిప్ ఈనెల తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున జరగనున్నాయి. బేగంపేట రసూల్ పురాలోని
శ్రీ స్వామినారాయణ్ మందిర్ ప్రాంగణంలో ఈపోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సెక్రెటరీ నందనం కృపాకర్ తెలియజేశారు.
ఈ పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం ముగుస్తాయని ఆయన అన్నారు. ఇందులో జూనియర్స్ సబ్ జూనియర్ సీనియర్స్ మాస్టర్స్ మహిళలకు పురుషులకు బాల బాలికలకు పోటీలు నిర్వహించబడతాయని పది నుంచి 14 సంవత్సరాలు సబ్ జూనియర్స్ గా 14 నుంచి 18 జూనియర్స్ గా 19 నుంచి 55 సీనియర్స్ a.b.c.క్యాటగిరీగా పోటీలు నిర్వహించబడతాయి. ఇందులో గెలుపొందిన ప్లేయర్లకు మెడల్స్ మరియు సర్టిఫికెట్ అందజేయబడతాయని పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.
గెలుపొందిన యోగాసనా ప్లేయర్స్ వచ్చే నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి యోగాసనా పోటీలలో పాల్గొనే అర్హుత పొందుతారని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి విజేతలు అక్టోబర్ నవంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని కృపాకర్ తెలిపారు.
ఆగస్టు 9న జరగబోయే పోటీలకు మేడ్చల్ జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని, అదే విధంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొ నెట్లు ప్రోత్సహించాలని కృపాకర్ విజ్ఞప్తి చేశారు.
యోగ సెంటర్ల నిర్వహకులు యోగ సాధకులు వివిధ యోగ సంస్థల సభ్యులు అధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొని లాభాన్వితులు కావాలని కృపాకర్ విజ్ఞప్తి చేశారు. వివరాలకు 8919319152 సూర్యప్రకాష్, 8978521281 సత్యనారాయణ లను సంప్రదించాలని సూచించారు.
మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే రికగ్నైజేషన్ ఉన్న ఏకైక యోగసనా ఫెడరేషన్ దేశంలో యోగాసనా భారత్ మాత్రమేనని దీని గుర్తింపు మనకు మాత్రమే ఉన్నదని ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఆయన సూచించారు.