హ్యూమన్ రైట్స్ టుడే/చింతలపూడి/ ఏలూరు /03 ఆగష్టు: ఏలూరు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ కె. రత్న ప్రసాద్ అలాగే చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి హెచ్. మధుబాబు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు పట్టణాలకే పరిమితి అవగాహన కలిగి వుండె న్యాయ విజ్ఞానాన్ని ఏలూరికి సుమారు డెబ్బై కిలోమీటర్లు చింతలపూడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో పూర్తి గిరిజన ప్రాంతాలుగా వున్న సంగారావు పేట సున్నపురాళ్ళపల్లి గ్రామాల నుండి ఏంతో మంది గిరిజన ప్రజలకు గిరి పుత్రులకు మర్రి గూడెం గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా ఉచ్చిత వైద్య శిబిరం నిర్వహించారు. అక్కడికి వచ్చిన గిరిజనులతొ జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ కె. రత్న ప్రసాద్ మాట్లాడుతూ మన రాజ్యాంగం గిరిజనుల కోసం ఏన్నో చట్టాలను తీసుకు వచ్చిందని ఆ చట్టాలను మీలో ఎవరైనా ఉపయోగించుకోవచ్చునని మిలో ఎవ్వరి మీద నైనా ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని వేంటనే ప్రతీ కోర్టుల్లో శనివారం జరిగే లోకాదాత్ లో పెట్టుకోని ఇరువురు రాజీకుదుర్చుకోని మీపై ఉన్న కేసులను తీసివేసుకున్నట్లైతె ఇరు పక్షాల వారు కేసు గెలిసినట్లెనని ఆలా కాకుండా మీపై వీడని పెద్ద కేసులు ఏమైనా ఉన్నట్లైతే మా లీగల్ సర్విసెస్ అథారిటీ వారికి తెలియజెసినట్లైతె మీ తరుపున మా కోర్టు నుండి ఒక న్యాయవాదిని మీ తరుపున వాదించడానికి నియమిస్తొమని వారికి స్పష్టమైన హామీ ఇస్తూనే మీలో ఎవ్వరూ తప్పు చేయనప్పుడు చట్టానికి గాని పోలీసులకు గాని భయపడనవసరం లేదని తెలియజేశారు.
అలాగే చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి. సి హేచ్. మధుబాబు మాట్లాడుతూ చైల్డ్ లేబర్ గురించి తెలియజేస్తూ మీ పిల్లలను కూలి పనులకు పంపవద్దని మీ పిల్లల కోసం ఏన్నో ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఏన్నో సదుపాయాలతో మంచి విద్యా బోధకులతో సంక్షేమ హాస్టళ్లను కూడా ప్రభుత్వం మీ కోసం ఏర్పాటు చేస్తుందని మీ అందరికీ మెరుగైన విద్యా వైద్యం మంచి చట్టాలను అందుబాటులో ఉంచిన ప్రభుత్వ విది విదానాలు అర్దం చేసుకోని ముందుకు వేళ్ళాలని అలాగే మైనర్ బాలికలకు వివాహాలు చేయవద్దని అలా చేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని మీ పిల్లలను మంచిగా చదివించుకుంటె ఏన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోనవచ్చని మీ పిల్లులకు అబ్దుల్ కలామ్ ని స్పూర్తిదాయికంగా చూపాలని తెలియజేశారు. అనంతరం అదే గ్రామంలో వున్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలోనికి వెళ్లి అక్కడ బాలికలను సంక్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్టల్లో వండుతున్న ఆహర పదార్ధాలను పప్పుధాన్యాలను కూరగాయలను నేరుగా చూసి వాటి నాణ్యతను పరీక్షీంచారు. అక్కడి ఉపాధ్యాయులను విద్యా భోదగురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి చింతలపూడి సబ్ జైలుకు వేళ్ళి అక్కడ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి ధర్మజిగూడెంలో గల సాయి జూనియర్ ఆండ్ డిగ్రీ కాలేజీలోనికి వేళ్ళి అక్కడ విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎవ్వరూ ర్యాగింగులకు పాల్పడవద్దని అందరిలోను చదువులో ముందుండలనే కసి పట్టుదల వుండాలని మీరు కాలేజీలో వున్నంత సేపు మీకు మీ తల్లిదండ్రులు వారు మీ కోసం పడే కష్టం మాత్రమే గుర్తుంచుకోవాలని అలా వున్నప్పుడే మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ కె.రత్న ప్రసాద్ అలాగే చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి సి హెచ్. మధుబాబు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చింతలపూడి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి. నాగేశ్వరరావు న్యాయవాది పట్నాల శ్రీనివాస్ లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ అక్బర్ అలీ జీలుగుమిల్లి సర్కిల్ సి.ఐ. క్రాంతి కుమార్, టి. నర్సాపురం పోలీస్ స్టేషన్ నుండి ఎస్సై దుర్గా మహేశ్వరరావు, మర్రి గూడెం గ్రామం నుండి గురుకుల హాస్టల్ వార్డెన్ తెల్లం జగ్గారావు డాక్టర్లు పాల్గొన్నారు.