కూటమి ప్రభుత్వం కుల గణన కంటే నైపుణ్య గణనకు పెద్దపీట..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/30 జూన్: నైపుణ్య గణన ఏమిటి? ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కుల గణన కంటే నైపుణ్య గణనకు పెద్దపీట వేస్తోంది. స్కిల్ గణనలో భాగంగా ప్రభుత్వం రాష్టమంతా ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరిస్తుంది. ప్రతి ఇంటిలో 18 ఏళ్లు నిండినవారు, చదువుకుంటున్నవారు ఎవరు ఉన్నారో, వారు ఏ కోర్సులు చదివారో, వారికి ఎలాంటి నైపుణ్యాలు కావాలో తెలుసుకుంటారు. ఏ స్కిల్స్ నేర్పిస్తే వారు వీలయినంత త్వరగా ఉద్యోగం లేదా ఉపాధి పొందగలరో ఆరా తీస్తారు.స్కిల్ గణన పూర్తయ్యాక రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఎవరికి ఎలాంటి స్కిల్స్ అవసరమో వాటిని నేర్పిస్తారు.