హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/29 జూన్: జూన్ 12న అన్వర్(39) అనే ఆటో డ్రైవర్ ఓ ప్రయాణికుడిని చార్మినార్‌లో ఎక్కించుకొని షంషీర్‌గంజ్‌లో దింపాడు.
ఆ ప్రయాణికుడు 10 రూపాయలు ఇవ్వగా, అన్వర్ ఇంకో 10 రూపాయలు ఎక్కువ అడిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం అయి ప్రయాణికుడు, అన్వర్‌ను బలంగా కొట్టి పారిపోయాడు.
గాయాలపాలైన ఆటో డ్రైవర్ అన్వర్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.