హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 08: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపై నరేంద్ర మోడీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. పాత్రికేయ, సినీరంగంపై ఆయన చెరగని ముద్ర వేశారు.
మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం నాకు ఎన్నోసార్లు దక్కింది. రామోజీరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి మోడీ అన్నారు.