హ్యూమన్ రైట్స్ టుడే/ముంబయి/మే 31: దేశంలో రూ.500 నోట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. రూ.2 వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకోవడంతో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. 2024 మార్చి నాటికి చలామణీలో ఉన్న మొత్తం నగదులో 86.5 శాతం వీటిదే కావడం గమనార్హం. అంతకు ముందు ఏడాది వీటి వినియోగం 77.1 శాతంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక నివేదికలో తెలిపింది.
గతేడాది మే నెలలో రూ.2 వేల నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీటి వాటా 10.8 శాతం నుంచి తాజాగా 0.2 శాతానికి దిగి వచ్చింది. దీంతో ఒక్కసారిగా రూ.500 నోటుకు డిమాండ్ ఏర్పడింది. సుమారు ఈ నోట్లు 5.16 లక్షల నోట్లు చలామణీలో ఉన్నాయి. దీని తర్వాత పది రూపాయాల విలువైన నోట్లు 2.49 లక్షల నోట్లు చలామణీలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణతో నకిలీ నోట్ల బెడద కూడా తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది.