హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వ..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 30: భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతి సారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్దతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.