హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/మే 28: సాలురా మండల కేంద్రం సమీపంలో ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ఆర్టీవో కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అన్న సమాచారంతో సోదరులు నిర్వహించడం జరిగిందని ఏసీబీ డిఎస్పి శేఖర్ స్పష్టం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ వద్ద నుంచి 13590 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును స్వీజ్ చేసిన అనంతరం చర్యలు ఉండబోతాయని వెల్లడించారు.