‘కల్తీ’ మీరు తింటానంటే బెయిలిస్తాం – సుప్రీంకోర్టు
పిటిషన్ వెనక్కి తీసుకున్న లాయర్..
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ/మే 28:
★ ఆహార కల్తీ కేసులో నిందితుడి తరఫున ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసిన న్యాయవాదికి సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది.
★ చివరకు తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
★ మధ్యప్రదేశ్‌కు చెందిన పవార్ గోయల్, వినీత్ గోయల్ అనే వ్యాపారులపై గోధుమ పిండిని కల్తీ చేసిన నేరానికి కేసు నమోదైంది.
★ ఆహార కల్తీ కేసులో ఆరోపణలకు బెయిల్ ఇవ్వొచ్చని, కాబట్టి తన క్లయింట్లను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పునీత్‌జైన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
★ ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం.ఆర్. షాలతో కూడిన ధర్మాసనం
*★ ‘‘ఒక్క మనదేశంలోనే ఆరోగ్యంపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. మీరుగానీ, మీ కుటుంబం గానీ మీ క్లయింట్ తయారు చేసి అమ్ముతున్న ఆహారాన్ని తింటే బెయిల్ ఇస్తాం. అందుకు మీరు సిద్ధమేనా?’’ అని నిలదీసింది.*
★ దీంతో న్యాయవాది సమాధానమివ్వలేదు.
*★ ‘‘సమాధానం ఇవ్వటానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఇతరుల ప్రాణాలైతే పోతే పోనీ. మనకేంటి అనుకుంటున్నారా?’’* అని న్యాయమూర్తులు అడగటంతో న్యాయవాది తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.