హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల/10 మే: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్ర ఇరిగేషన్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మాణాన్ని సమర్పించి చిట్టాపూర్ ముదిరాజ్ సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి మద్దత్తు ప్రకటించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో జువ్వాడి నర్సింగరావు, కృష్ణరావు ఆధ్వర్యంలో నిజామాబాదు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎమ్మెల్యే డాక్టర్ మంత్రాగౌడ, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణరావు మరియు చిట్టాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.