‘సమయం లేదు మిత్రమా’ అంటూ ఓటర్ల చెంతకు పరుగులు..

Get real time updates directly on you device, subscribe now.

రెండు రోజుల్లో ముగియనున్న ప్రచారం..ఓట్ల వేటలో ప్రధాన పార్టీలు..

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/10 మే: సార్వత్రిక సమరం (2024) తుది దశకు చేరుకుంది. ఈనెల 11వ తేదీతో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్ధులు ‘సమయం లేదు మిత్రమా’ అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. పాంప్లెట్లు, న్యూస్ పేపర్లు, బ్రోచర్లు వంటి ప్రచారాలతో పాటు, సోషల్ మీడియా డిజిటల్ మీడియాని విస్తృతంగా ప్రచారానికి వినియోగిస్తున్నారు. డిజిటల్ స్క్రీన్లతో వాహనాలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ఐవిఆర్ఎఫ్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. నాయకులు తమవంతు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఆఖరి ఓటును కూడా తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఇప్పటికే సేకరించిన నాయకులు వారిని రప్పించి ఓటు బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి ఇద్దరు చొప్పున బాధ్యులను నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా, ఆయా ప్రాంతాలపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి.  ఓటర్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి ఒక్కో ఓటరుకు ప్రత్యేకంగా సమయమిచ్చి తమవైపు తిప్పుకునే విధంగా చేయాలని గ్రామస్థాయి నేతలను ఆదేశిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment