పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ. 10వేలు..రైతు భరోసా నిధులు విడుదల..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/06 మే: తెలంగాణలో రైతు భరోసా పథకం కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ చేసింది. కాగా ఈనెల 9లోగా రైతు భరోసా నిధులను పూర్తిగా జమ చేస్తామని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే. వీటితో పాటు పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ. 10వేల నిధులను కూడా ఈసీ అనుమతితో ప్రభుత్వం విడుదల చేసింది.