రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ షాక్
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మే 06: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులోఈరోజు మళ్ళీ చుక్కెదురైంది.
లిక్కర్ పాలసీలో ఈడీ, సీబీఐ కేసులో కవితకు ఊరట దక్కలేదు. తనకు బెయిల్ కావాలని కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.
ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు. జడ్జి కావేరి బవేజా లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్‌గా పేర్కొన్న దర్యాప్తు సంస్థల వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.
కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, ఆధారాలు, సాక్షాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.