నరేంద్ర మోదీపై పోటీ చేస్తున్న హిందూ మహాసభ హేమాంగి సఖి మాత (ట్రాన్స్ జెండర్) బరిలో నిలిచారు.
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/ఏప్రిల్ 13:
ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గం నుంచి లోక్ సభ ఎన్నికలబరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయనపై ఓ ట్రాన్స్ జెండర్ కూడా పోటీ చేస్తుండటం ఆసక్తికరం. అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం)కు చెందిన హేమాంగి సఖి మాత బరిలో నిలిచారు.
బరోడాలో జన్మించిన ఆమె ప్రపంచంలో భగవద్గీతను బోధిస్తున్న మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ కావడం విశేషం. 2019లో ఆమె ఆచార్య మహా మండలేశ్వర్ పట్టాభిషిక్తులయ్యారు.