హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందే: హైకోర్టు తాజాగా భరణం విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సంపాదించే మహిళ అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులతో జీవనోపాధి పొందలేని స్థితిలో ఉన్న మాజీ భర్తకు భరణం చెల్లించాలని పేర్కొంది. బ్యాంకు మేనేజర్ అయిన ఓ మహిళ తన మాజీ భర్తకు భరణం చెల్లించలేనని వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు నెలకు రూ.10వేల భరణం చెల్లించాలని పేర్కొంది.