హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: ఎన్నికల తర్వాతే గృహజ్యోతికి కొత్త దరఖాస్తులు గృహజ్యోతి పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త దరఖాస్తులను ఆమోదిస్తామని డిస్కంలు స్పష్టం చేశాయి. గత నెలలో జీరో బిల్లు జారీ అయిన 36 లక్షల మందికి ఈ నెలలోనూ యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు. మరో 7 లక్షల ఇళ్ల కనెక్షన్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జారీ చేయాల్సి ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.