జైలుకైనా వెళ్తా కానీ, పార్టీ మారను: మాజీ మంత్రి ఎర్రబెల్లి*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 06:
రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు గుర్తుచేశారు.
హామీలను అమలు చేయాలని అడిగితే కేసులతో భయ పెడుతున్నారని విమర్శించారు.