సుమారు రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి..

Get real time updates directly on you device, subscribe now.

జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై..

నకిలీ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సృష్టించిన వైనం..

సుమారు రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి..

మూడో రోజు ఏసీబీ విచారణ ప్రారంభం..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 25: గొర్రెల స్కామ్ కేసులో  ఏసీబీ విచారణ ముమ్మరంగా సాగుతోంది. సోమవారం ఉదయం బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విచారణ ప్రారంభమైంది. జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను మూడో రోజు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గొర్రెల స్కామ్‌కు సంబంధించి ఇద్దరి స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. ఈ స్కాంకు సంబంధించి పశుసంవర్ధక శాఖలోని మరికొందరి పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయిదుద్దీన్‌కు నిందితులకు గల సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. సుమారు రెండు కోట్ల పది లక్షల రూపాయలను బినామీ ఖాతాల్లోకి దారి మళ్లించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం ఐదు రోజుల పాటు అంజిలప్పను ఏబీబీ విచారించనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది.

కాగా గత ప్రభుత్వంలో వివిధ శాఖలు, పథకాల్లో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కార్ దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గొర్రెల పంపిణీ పథకంలోనూ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సృష్టించి సుమారు రూ. 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు. ఈ స్కామ్‌ ఈ ఇద్దరు అధికారులు కీలక పాత్ర పోషించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతకుముందు కూడా పలువురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment