ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ని గెలిపించాలి : కేటీఆర్.
నేతలకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్..
గోవా సమావేశానికి హాజరైన కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్.
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబ్ నగర్/మార్చ్ 25: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలానికి చెందిన నవీన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా స్థానిక నేతలను వారం రోజుల ట్రిప్ గా గోవాకు తరలించారు. అక్కడ వారితో ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలతో కేటీఆర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఈనెల 28 నే ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను వారికి వివరించారు. నవీన్ రెడ్డిని గెలిపించాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.