అధికారంలోకి వస్తే దేశమంతా రైతు బంధు : సీఎం కేసీఆర్
మోడీ హయాంలో తెలంగాణలో తప్ప దేశమంతటా కరెంటు కోతలే ఉన్నాయని విమర్శించారు. అసలు దేశంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, లక్షల కోట్ల సంపద ఏమైపోయిందో తెలియడం లేదని కేసీఆర్ వాపోయారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేంద్రం నీళ్ల కోసం రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టి చోద్యం చూస్తోందని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ భావజాలం ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశంలో వెలుగుజిలుగులు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.