హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ జిల్లా/ మార్చి 24:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇంద్రపూర్ సమీపంలోని ప్రయివేటు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మ తు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.
దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ మరమ్మతు కేంద్రానికి చుట్టు పక్కల ఇళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.