ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది…

Get real time updates directly on you device, subscribe now.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించలేని దైన్య స్థితిలో ప్రభుత్వాలు !!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్24:
సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ (చట్టం, న్యాయం, ధర్మం తరువాత స్థానం మీడియా)గా చెప్పుకుంటున్న గొప్ప స్థానం మీడియాది. కానీ జర్నలిస్ట్ ల విషయంలో ఆ ఆనవాళ్లు మచ్చుకైనా కనపడవు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా వారికి ముఖ్యులు, ముందు వారి పార్టీ కార్యకర్తలు, చివరలో ప్రజలు ఇలా చూస్తున్నారే తప్ప జర్నలిస్టుల వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు.

పైగా ఈ మధ్య ఆ ఫ్యాషన్ ముదిరి పాకాన పడి అసలు మీడియాతో మాకేం పని అన్నట్లుగా వారే సొంతగా ఫోటోలు, వీడియోలు తీసి అవి కొంతమందికి అందుబాటులో ఉన్న వారికి పంపుతున్నారు. ఇది ఒకరకంగా జర్నలిజాన్ని చంపేసినట్లే భావించవచ్చు.

మరి ఇలాంటి ఇరుకు స్థితిలో ఉన్న జర్నలిస్ట్ ను కాపాడే నాధుడే లేడా అని లోలోపల కుమిలిపోయే సందర్భం ప్రస్తుత స్థితిలో జర్నలిస్ట్ ఉన్నాడు అని పాలకులు గుర్తించాలి. కనీస మౌలిక సదుపాయాలు అయిన విద్య, వైద్యం, ఇల్లు, లాంటి సదుపాయాలు కూడా జర్నలిస్ట్ కు కల్పించకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు ??

గతంలో కొంత మెరుగ్గా ముందు గౌరవంగా ప్రెస్ మీట్ కు పిలిచి ముందు కూర్చోమనేవారు. కానీ ఇప్పటి పరిస్థితి లో చాలా మార్పు వచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు. అని అనే పరిస్థితి కి వచ్చింది. మరి ఇది ఏ పరిస్థితి కి అద్దం పడుతుందో ఊహించవచ్చు. ఇది ప్రస్తుత సమాజానికి మంచిది కాదు అని ప్రజలు అంటున్నారు.

ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిలా ఉండి ప్రశ్నించి పోరాడి సమాజంలో మంచి కోసం తపించే మీడియాను మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు. అనే పరిస్థితి వస్తే ఇక అంతకంటే దైన్యం ఏముంటుంది?ఇకనైనా ప్రభుత్వాలు మారాలి…

ఎందుకంటే జర్నలిస్టులకు కుటుంబాలు ఉన్నాయి. వారికి వేలకొద్ది ఓట్లు ఉన్నాయి. ఆ సంగతి ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలి.



1.ముందు ప్రతి జర్నలిస్ట్ కు ఇల్లు కట్టి ఇవ్వాలి,

2.ప్రతి జర్నలిస్ట్ కు ఆరోగ్య భీమా సదుపాయం ఉచితంగా కల్పించాలి అది కూడా ప్రతి సంవత్సరం.

3.ఏ జర్నలిస్ట్ పై దాడి జరిగినా నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు కింద నమోదు చేసి కఠిన శిక్ష విధించాలి.


4.ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య కల్పించాలి.


5.ప్రతి జర్నలిస్ట్ కు జబ్బు ఏదైనా సరే ఆసుపత్రి ప్రవేశం దగ్గర నుంచి  ఉచిత ఆరోగ్య పరీక్షల తో పాటు ఆపరేషన్ లు సైతం పైసా ఖర్చు లేకుండా ప్రతి ప్రైవేటు మరియు సర్కార్ ఆసుపత్రిలో జరిగేలా ప్రభుత్వాలు పాటించాలి.


6.ప్రతి జర్నలిస్ట్ కు గౌరవ వేతనాలు కల్పించాలి
7.వయసు అనగా 50 ఏళ్ళు దాటిన ప్రతి జర్నలిస్ట్ కు పింఛన్ సదుపాయం కల్పించాలి

8.జర్నలిస్టుల పిల్లల్లో ఎవరైనా అర్హత ఉన్న వారికి బాంక్ లోను (వారి భవిష్యత్ కోసం) సదుపాయం కల్పించాలి.

9.పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలతో మరియు వారి కింద
పనిచేసే జర్నలిస్ట్ లకు మధ్య వారధిలా ఉండి వారి సమస్యలు పెద్దన్న లా పరిష్కారం చూపాలి.

10.జర్నలిస్టులు ఎవరైనా ప్రమాదాలు,అకాల మరణాలతో సంభవిస్తే వారికి ప్రభుత్వాలు కనీసం అనగా 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహకారం అందించాలి.

11.ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు కావాల్సిన సదుపాయాల కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు అవి అందేలా చూడటం.

12.అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్ కు అక్రిడేషన్ సదుపాయం కల్పించాలి.
ఇలా చూసే వారికి మా జర్నలిస్ట్ కుటుంబాలు తప్పకుండా ఓట్లు వేస్తాయి.


మీ మీ మ్యానిఫెస్టోలో కూడా మా జర్నలిస్ట్ ల గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది…
తేల్చుకోండి పాలకులారా !!


ఇట్లు

ఓ జర్నలిస్ట్

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment