హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మార్చి 24:
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతాల్లో నిర్మా ణ పనులకు ఉచితంగా ఇసుక అందిస్తామని తెలిపింది.
ఇసుక కొరతతో లోకల్ గా నిర్మాణ పనులు ఆగిపోకుం డా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ ల నుంచి ఉచితంగా ఇసుక అందిస్తా మని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమ తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ గ్రామా ల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవస రాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటూ వరుసగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవస రాలకు సమీపంలోని వాగుల నుంచి ఇసుకకు ఉచితంగా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అవసరమున్న వారు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ఉచితంగా ఇసుక ద్వారా రవాణా చేసుకునేందుకు అనుమతిస్తారు. నిబంధన లను ఉల్లంఘించినట్లయితే సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.