తోట చంద్రశేఖర్‌కు రూ. 4 వేల కోట్ల విలువైన భూములు – బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కంపెనీకి నాలుగు వేల కోట్ల విలువ చేసే భూములు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.. ఖమ్మం సభ ఖర్చు అంతా ఆయనే పెడుతున్నారని చెప్పారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కనుసన్నలోనే మియాపూర్ భూకుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. ఉద్యమంలో రాక్షసులైన ఆంధ్రోళ్ళు ఇప్పుడు రక్తసంబంధీలు ఎలా అయ్యారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. తోట చంద్రశేఖర్ కు 40ఎకరాల మియాపూర్ భూములు కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర ఉందన్నారు. భూ దందా కోసమే తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ బీఆర్ఎస్ లో చేర్చుకుని ఏపీకి అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. బీహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్ కు ప్రేమ ఎక్కవని..అందులో భాగంగానే బీహార్ కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారని మండిపడ్డారు.