కేంద్రం, రాష్ట్రంలో కూడా కెసిఆర్ కు మద్దతు లేకపోవడంతో తప్పించుకొనే అవకాశం లేక కొత్త ఎత్తుగడగా..
ఇప్పుడు తనమీద దాడి అంతా పగతోనే తాను సత్తె పూసను అని జనాన్ని నమ్మించి జనంలో సానుభూతి కోసం వందల యూటూబ్ ఛానల్..
అక్రమంగా సంపాదించిన వేలకోట్లు వెదచల్లి తప్పుడు వార్తలతో తన కుక్కలను మొరిగిస్తూ..
కుటుంభం మొత్తం గల్లీ మీటింగ్ లు పెడుతూ రేవంత్ మీద బురద చల్లడానికి ప్రయత్నాలు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్10:ఒకప్పుడు ఓటుకు నోటు పేరుతో కేసిఆర్ చేసిన డ్రామా ఇప్పుడు అతడి మెడకే ఉరితాడు కాబోతుంది. చంద్రబాబును ఆ దేముడు కూడా కాపడలేడు ఆన్న కేసిఆర్ కు ఇప్పుడు చంద్రబాబు దేముడు కాబోతున్నాడు. రేవంత్ ను ఎలాగైనా ఆపమని ప్రదేయ పడటం విశేషం. బళ్ళు ఓడలు..ఓడలు బళ్ళు అవడం అంటే ఇదేనేమో కొద్ది రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ వార్త సంచలంగా మారింది. కానీ ఎప్పటిలానే కొన్ని రోజులు హడావిడి మళ్ళీ మరిచిపోతారు అని కొందరు అనుకొంటున్నారు. కాని రేవంత్ రెడ్డీ సీఎం అవ్వడంతో మొదట చేసిన గొప్ప పని ఇదే. కొన్ని రోజులవరకు హోం తనవద్ద ఉంచుకోవడానికి కారణం ఇదే.
పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి కెసిఆర్ కుటుంభానికి చెక్ పెట్టడానికి, ఇన్ని రోజులు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ను వజ్రాయుధంలా వాడిన దాన్ని తిరిగి వాళ్ళ మీదకే ప్రయోగించడానికి రేవంత్ ఎంతో ప్లాన్ గా ముందుకు వెళుతున్నాడు. రేవంత్ రెడ్డికే కాదు కొన్ని నెలల క్రితం ఫామ్ హౌస్ లో ప్రముఖ బీజేపీ నాయకులను డబ్బుతో పట్టుకొన్నాం అని హంగామా చేసి దేశంలో అన్ని రాష్ట్రాల నాయకులకు న్యాయ మూర్తులకు లెటర్స్ రాసి బీజేపీ తన ప్రభుత్వం పడగొట్టడనికి కుట్ర చేస్తే తాను పట్టుకొన్నాని డ్రామాలు చేశాడు. ప్రధాని మోడీనీ నానా భూతులు తిట్టాడు. ఆ దెబ్బతో దేశ రాజకీయాలలో సంచలనంగా మారి దేశానికే ప్రధాని అవుతా ఆని కలలు కన్నాడు కెసిఆర్నీ దేశంలో ఎవ్వరూ నమ్మలేదు. ఓటుకు నోటుతో పాటు డీజీపీనీ కూడా వదలలేదు. ఈ విషయంపై రేవంత్ అంతర్గతంగా సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టి పునాదులను కదిలించేశాడు. కెసిఆర్ ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా మౌనంగా ఉన్నాడు.
కానీ రేవంత్ రెడ్డీ చాప క్రింద నీరులా తన పని తానుచేసుకొంటూ పోతున్నాడు. డీజీపీగా మహేందర్ రెడ్డీ నియామకాన్ని కవిత తప్పు పట్టి అతిగా రియాక్ట్ అవ్వడానికి మొదట చాలా మందికి అర్థం కాలేదు. కానీ మెల్లమెల్లగా అర్ధం ఐనది ఏమిటంటే డీజీపీ అప్రూవల్ గా తమ బాగోతాలు ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాడు అని అందుకే అతడిపై అవినీతి ముద్ర వేయడానికి ప్రయత్నం చేసింది. మొదట రేవంత్ సీఎం కాకుండా బీజేపీతో నాటకం చేయగా అనుకున్న పలితాలు రాలేదు. నల్గొండ మీటింగ్తో జనంలో అలజడి లేపి గొడవలు చేసే ప్రయత్నం ఫలించలేదు. కాళేశ్వరం వెళ్ళి గొడవలు సృష్టించే ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు. ఈ మధ్యలో పార్టీలో గతంలో చేసిన స్కాంలు ఒక్కోటి బయటకు రావడంతో నాయకులు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి మూట ముల్లె సద్దుకోడం మెడమీద కత్తిలా ఇప్పుడు ఎంపీ ఎన్నికలు రావడంతో ఏమిచేయాలో తెలియక ప్రేష్టేశన్ లో కల్వకుంట్ల కుటుంభంలో అంతకలహాలు మొదలయ్యాయి. చివరకు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రేవంత్కు ఇప్పుడు కేంద్రంనుంచి మోడీ సహకారం అందటంతో కెసిఆర్ కు పుండు మీద కారం చల్లినట్లు గా ముందు నుయ్య వెనుక గొయ్యి లా మారింది. కెసిఆర్ చేసినది మామూలు తప్పు కాదు ఆది రాజద్రోహం. రేవంత్ ఒక్కడు బాధపడ్డ సమస్య కాదు బీజేపీ నీ దేశంలోనే అప్రతిష్ట పాలు చేసిన కుట్ర. బీజేపీ లో ఒక ప్రముఖనయకుడిని జైలుకు పంపడం కోసం కెసిఆర్ ఎంతో ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కేంద్రం రేవంత్ కు ఈ విషయంలో పూర్తి మద్దతు ఇవ్వడంతో రేవంత్ ఆపరేషన్ సక్సెస్ కాబోతుంది. కేంద్రం, రాష్ట్రంలో కూడా కెసిఆర్ కు మద్దతు లేకపోవడంతో తప్పించుకొనే అవకాశం లేక కొత్త ఎత్తుగడగా ఇప్పుడు తనమీద దాడి అంతా పగతోనే తాను సత్తెపూసను అని జనాన్ని నమ్మించి జనంలో సానుభూతి కోసం వందల యూటూబ్ ఛానల్ సృష్టించి. అక్రమంగా సంపాదించిన వేలకోట్లు వెదచల్లి తప్పుడు వార్తలతో తన కుక్కలను మొరిగిస్తూ కుటుంభం మొత్తం గల్లీ మీటింగ్ లు పెడుతూ రేవంత్ మీద బురద చల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కరువు వచ్చినప్పుడు రైతులు పడ్డ బాధల వీడియోలు ఇప్పుడు జరిగినట్లుగా రేవంత్ తో నే సమస్యలు వచ్చినట్లు కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడం వెనుకు కెసిఆర్ వ్యూహం ఇదే.