మాకు జనవరి 22న డెలివరీ చేయండి

Get real time updates directly on you device, subscribe now.

జనవరి 22న డెలివరీ చేయండి: గర్భిణీ మహిళల విన్నపం

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ డిల్లీ /జనవరి 08:
యావత్ భారతదేశం జనవరి 22వ తేదీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అయోధ్యలో పండగ వాతావరణం కూడా నెలకొంది.

ఇప్పటికే అన్ని రకాల కార్య క్రమాలు పూర్తయ్యాయి. దేశ నలుమూలల నుంచి హిందువులు ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు అయోధ్య వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అయోధ్య పట్టణంలోని హోటల్స్‌ అన్నీ బుక్‌ అయిపోయాయి.

ఇదిలా ఉంటే రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసే రోజే తాము బిడ్డకు జన్మనివ్వాలని కొందరు గర్భిణీలు కోరుకుంటున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌కి చెందిన నెలల నిండిన గర్భిణీలు జనవరి 22వ తేదీ రోజునే తమకు ఆపరేషన్లు చేయాలని డాక్టర్లను కోరుకుంటున్నారు.

ప్రస్తుతం నెలలు నిండి ప్రసవానికి సిద్ధంగా ఉన్నవారు సైతం జనవరి 22వ తేదీ వరకు ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక జనవరి 22 వ తేదీ వరకు నెలలు పూర్తిగా నిండని వారు కూడా కొంత ముందస్తు గానే జనవరి 22 వ తేదీన తమకు ఆపరేషన్లు చేసి బిడ్డలను బయటికి తీయా లని వేడుకోవడం గమనార్హం.

అయితే వైద్యులు మాత్రం గర్భిణీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసు కుంటామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొందరు జనవరి 22న బిడ్డకు జన్మిస్తే రాముడు పేరు వచ్చేలా పేర్లు పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయోధ్యలో రాముడు కొలువుతీరనున్న సమయం అత్యంత శుభ సమయ మని ఆరోజు ఎంతో పవిత్ర మైందని అక్కడి వారు భావిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment