మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
హ్యూమన్ రైట్స్ టుడే/విజయవాడ/జనవరి 03:
విజయవాడలో మంత్రి బొత్స సత్యనారయణ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వందలాది నిరుద్యోగులు, డివైఎఫ్ఐ కార్యకర్తలు కార్యలయం ముట్టడికి యత్నించారు.
సమచారం అందుకున్న పోలీసులు కార్యలయం ముట్టడికి వస్తున్న ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు ఆందోళనకా రులను అరెస్ట్ చేసి పోలీస్ స్గేషన్ తరలించారు.