నాకు నా పిల్లలకు న్యాయం చేయండి: ఓ బాధితురాలు ఆవేదన.
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జనవరి 02:
అత్త వేధింపులు భరించలేక పోతున్నా అంటూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్రజా భవన్ వద్ద మంగళవారం ఉదయం ఓ మహిళ బైఠాయించింది.
భర్త చనిపోయాడని, ఆస్తిలో తనకుగానీ, తన పిల్లలకు గానీ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని తెలిపింది.
మణికొండ శివాజీనగర్ నివాసి సుధారాణి, ధన్ రాజ్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా, కొంతకాలం క్రితం ధన్ రాజ్ చనిపోయాడు.
ఆ తర్వాత సుధారాణి అత్త ఆమెను వేధించటం మొదలు పెట్టింది. ఆస్తి మొత్తం తన కూతుర్లకు రాసి ఇచ్చింది.
నానాటికి అత్త వేధింపులు అధికం కావటంతో భర్త ఫోటో, తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ప్రజాభవన్ కు వచ్చిన సుధారాణి అక్కడే బైఠా యించింది.
తనకు, తన పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరింది.