నేటి నుండి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 28:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రజా పాలన కార్యక్రమం షురూ కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అయిదు పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది.
మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల వంటి పది అంశాలను పూరించాలి.
https://youtu.be/A95Dc3epYDs?si=DSbS1f_WxnDLZKmF
ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు.