ఆంధ్రప్రదేశ్/కాకినాడ జిల్లా/
తుని నియోజకవర్గం/కోటనందూరు/హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి:-
కోటనందూరు మండలం,ఎస్ ఆర్ పేటకు చెందిన అన్నంరెడ్డి రాము సంవత్సర కాలం నుండి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నర్సీపట్నం పర్యటన సందర్భంగా ఆయనను కలిసి తన సమస్యను వివరించి ఆదుకోవాలని అభ్యర్ధించాడు.రాము నిస్సహాయ పరిస్థితికి చలించిన ముఖ్యమంత్రి అతనికి వైద్య సహాయం అందించాల్సిందిగా కాకినాడ జిల్లా కలెక్టర్ కు సూచించారు.ఈమేరకు మంగళవారం రాము జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాను కలువగా, కోటనందూరు మెడికల్ ఆఫీసర్, డియంహెచ్ఓ లతో అతని చికిత్స నిమితం అవసరమైన ఏర్పాట్లు పై చర్చించి సత్వరం కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అతని చికిత్సకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం తరపున అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భరోసా కల్పించారు.
తన సమస్యపై వెంటనే స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కృతికాశుక్లాకు ఆనంద భాష్పాల తో రాము ధన్యవాదాలు తెలిపారు.