దివంగత నేత పివి నరసింహారావు 19వ వర్ధంతి

Get real time updates directly on you device, subscribe now.

దివంగత నేత పివి నరసింహారావు 19వ వర్ధంతి: సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 23:
పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

పీవీ 19 వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వ‌ద్ద రేవంత్ రెడ్డి నివాళు ల‌ర్పించారు. అనంతరం ఆయ‌న మాట్లాడుతూ భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొ చ్చిన వ్యక్తి పీవీ అని సీఎం వ్యాఖ్యానించారు.

పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమ‌ని, పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌ల‌ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని పేర్కొన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment