గ్రామీణ ప్రాంత కులవృత్తులను కాపాడుకోవాలి

Get real time updates directly on you device, subscribe now.

గ్రామీణ ప్రాంత కులవృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి

హ్యూమన్ రైట్స్ టుడే/భువనగిరి జిల్లా/డిసెంబర్ 20:
చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అంది స్తుందన్నారు.

పోచంపల్లి, వరంగల్, సిరి సిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావ డం అభినందనీయమన్నా రు.పోచంపల్లి చేనేత వస్త్రా లను చూస్తే సంతోషం కలి గిందన్నారు. భారత సంస్కృ తి,సంప్రదాయాల్లో చేనేత ఒకటన్నారు. UNA భూధా న్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతం గా గుర్తించడం అభినంద నీయమన్నారు.

ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతుదొ రుకుతుందన్నారు.చేనేత వస్త్రాల కృషి గొప్పదన్నా రు.కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్పది, అభినందనీయ మన్నారు.


ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించడం గొప్ప కళా కారుల లక్ష్యమని,చేనేత రంగాన్ని ముందుకు తీసు కెళ్తున్న అవార్డు గ్రహీతలం దరికీ,నాశుభాకాంక్షలు, ధన్యవాదాలన్నారు.

చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం,గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమన్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం,అధికారులు మరింత చొరవచూపా లన్నారు.

చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలన్నారు.తమ ప్రాంత ప్రజలను పోచంపల్లి కి తీసుకు వస్తానన్నారు.

రాష్ట్రపతి పోచంపల్లి పర్య టన సందర్భంగా రాష్ట్రపతి కి మంత్రి సీతక్క,ప్రభుత్వవి ప్,బిర్ల ఐలయ్య, భువ నగి రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి త్వశాఖ సెక్రటరీ రచన సాహు, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టి పోలు విజయ లక్ష్మిలు ఘన స్వాగతం పలికారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment