చాప కింద నీరులా వ్యాపిస్తున్న JN.1 వేరియంట్ వైరస్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 20:
గతంలోరెండేళ్ల పాటుప్రపం చాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ మెల్లగా కోరలు చాస్తోంది. చాప కింది నీరులా క్రమంగా వ్యాపిస్తోంది. కొవిడ్ 19 కొత్త వేరియంట్ జేఎన్.1 (Covid 19 variant JN.1) ఇప్పటికే కేరళలో తిష్ఠ వేసింది.
ఈ కొత్త వేరియంట్ బారిన పడి 79 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు వదిలింది. ఇక.. మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులో నమోదవుతున్నాయి. మొన్నటి ఆదివారం డిసెంబర్ 17 ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 కరోనా పాజిటివ్ కేసులు నమోద య్యాయి.
ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. కాగా.. తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశిం చింది. దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణ ప్రభు త్వం కొవిడ్ బులిటెన్ విడు దల చేసింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లో కొత్తగా 4 కొవిడ్ పాజి టివ్ కేసులు నమోదయ్యా యి. మంగళవారం రోజున ఆరోగ్య సిబ్బంది 402 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
అయితే..ఈ నాలుగు కేసు లతో కలిపి..ప్రస్తుతం రా ష్ట్రంలో 9 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ బులిటెన్లో పేర్కొంది.