హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 20:
తెలంగాణ అసెంబ్లీ సమా వేశాల్లో నేడు కీలక ఘట్టం ఆవిశ్కృతం కానుంది,అధి కార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ పీపీటీ,ఇవ్వా లని నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేయను న్నారు. ఈ నేపథ్యంలో సభ లో మరోసారి చర్చలు వాడీ వేడిగా కొనసాగే అవకా శాలు కనిపిస్తున్నాయి.
ఇవాళ ఉదయం 11 గంటల కు సభ ప్రారంభం కానుంది. ముందుగా సభలో సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆ తర్వాత’తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రం’పై లఘు చర్చ ఉం టుంది.
గత తొమ్మిదిన్నరేళ్ల లో రాష్ట్రం తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిం దని,సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. వీటిపై శాసససభ వేదికగా పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇవ్వాలని అయన కోరారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోందని, దీన్ని సమర్థంగా తిప్పికొట్టా లని ఆ పార్టీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర ముఖ్యనేతలు విడిగా సమా వేశమై.. బుధవారం అసెంబ్లీ లో అనుసరించాల్సిన వ్యూ హాలపై ఇప్పటికే చర్చిం చినట్లు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటే షన్ ఇచ్చే అంశాలపై అసెంబ్లీలో నే తాము కూడా పీపీటీ ద్వారా వాదన వినిపించా లని,బీఆర్ఎస్ నిర్ణయిం చింది.
అసెంబ్లీలో పీపీటీకి తమకూ అవకాశమివ్వాలని కోరు తూ,ఇప్పటికే స్పీకర్ కార్యా లయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వినతిపత్రం అందజేశారు. దీనిపై సభాపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
అసెంబ్లీ సమావేశాల ఆరంభంలోనే అధికార కాంగ్రెస్, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. పరస్పర ఆరోపణలతో సభ హీటెక్కింది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం డిసెంబర్ 16న,జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన కేటీఆర్.గతం లో కాంగ్రెస్ పాలన గురించి ప్రస్తావించగా,గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి మాట్లాడాలని అధికార పార్టీ సభ్యులు సూచించారు.
ఈ సందర్భంగా రెండు పక్షా ల నాయకుల వాగ్వాదాలు, పరస్పర ఆరోపణలకు సభ హీటెక్కింది.ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి,మాటల యుద్ధం తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.