తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల బరిలో సోనియా గాంధీ?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 20:
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పొలిటి కల్ ఆఫైర్స్ కమిటీ తీర్మానిం చిన కాఫీలు ఢిల్లీకి చేరాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ జనరల్ సెక్ర టరీ కేసీ వేణుగోపాల్‌కు అందజేశారు.
సోనియా గాంధీ పోటీపై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చించారు. ఒప్పిస్తానంటూ రేవంత్‌కు కేసీ హామీ ఇచ్చినట్లు తెలి సింది.
సోనియాకు ఈ సారి పార్ల మెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేకపోతే తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ సీటును పొందాలని రేవంత్ కేసీకి రిక్వెస్టు చేశారు.
అగ్రనేతతో చర్చించి నిర్ణ యం చెబుతానని కేసీ క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలపాలనేది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం.
ఇప్పటికే పవర్ లోకి తీసుకు వచ్చి థాంక్స్ చెప్పిన పార్టీ.. త్వరలో సోనియా గాంధీని తెలంగాణ నుంచి ప్రతిని త్యం వహించే అవకాశం ఇవ్వాలనేది నేతల అభిప్రాయం.
సీఎం రేవంత్ ప్రత్యేక ఇంట్రస్ట్‌తో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.