తనకు మార్గదర్శకులుగా ఉండండి l ప్రెస్ క్లబ్ సభ్యులను కోరిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మేల్యే ఆది శ్రీనివాస్
హ్యూమన్ రైట్స్ టుడే/వేములవాడ/డిసెంబర్ 19:
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను IJU వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో లో ఘనంగా సన్మానించారు.
జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారం కోసం ఆది హామీ ఇచ్చారు.
అర్హులైన జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని అన్నారు.
వేములవాడ అభివృద్ది లో అన్ని వర్గాల ప్రజల తో పాటు జర్నలిస్ట్ లు తనకు మద్దతు గా ఉండి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
జర్నలిస్ట్ లు తనకు మార్గ దర్శకులు గా ఉండి, వేములవాడ అభివృద్ది లో భాగస్వాములు కావాలని ఆది కోరారు.