హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

Get real time updates directly on you device, subscribe now.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/డిసెంబర్ 19:
దేశంలోని పురాతన విద్యా సంస్థల్లో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఒకటి. విద్యా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా సేవలందిస్తున్న బేగం పేటలోని హెచ్‌పీఎస్‌ 2023నాటికి వందేళ్లకు చేరుకున్నది.

ఇందులో భాగంగా ఈ ఏడాది పొడువునా శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా ఈ శతాబ్ది ఉత్సవ వేడుకలకు భారత రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు.

రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యా రు.హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ ప‌ట్టివేత‌ ఈ సందర్భం గా రాష్ట్రపతి మాట్లా డుతూ..

గొప్ప పూర్వ విద్యార్థులను తయారు చేసినందుకు హెచ్‌పీఎస్‌ని ప్రశంసిం చారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషదా యకంగా ఉందని ముర్ము అన్నారు.

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్‌లో చదివిన విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనా దెళ్ల, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు లాంటి అనేకమంది గొప్పవాళ్లు ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారని అన్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ లో చదువు తున్న టువంటి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అవరోధించాలన్నారు. హెచ్‌పీఎస్‌ విద్యార్థుల ప్రతిభతో భారతదేశ గౌరవం కూడా పెరుగుతూ వస్తోంద న్నారు.

పాఠశాలలోని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదేనన్న రాష్ట్ర పతి.. విద్యార్థులు పర్యా వరణం, ప్రకృతి పైన అవగాహన పెంచుకోవా లన్నారు. విద్యార్థులందరూ కేవలం తమ స్వార్ధ ప్రయోజ నాలు కాకుండా వేరే వారికి సహాయపడే అలవాటు చేసుకోవాలని సూచించారు.

విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వారి జీవిత నైపుణ్యాలను నేర్చుకో వడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రపతి ముర్ము సూచించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment